Society – Meaning, Characteristics & Functions
సమాజం – అర్థం, లక్షణాలు మరియు విధులు
The concept of “Society” is the fundamental building block of Sociology. For competitive exams like CDPO, Extension Officer (EO), and Group 1 & 2, questions are frequently framed from definitions, structural characteristics, and sociological statements.
సమాజశాస్త్రంలో (Sociology) ‘సమాజం’ (Society) అనేది అత్యంత ప్రాథమికమైన మరియు కీలకమైన భావన. CDPO, Extension Officer (EO), మరియు గ్రూప్ 1 & 2 పరీక్షల సిలబస్‌లో దీని నిర్వచనాలు, లక్షణాల నుండి తరచుగా ప్రశ్నలు అడుగుతుంటారు.
Etymology & Meaning / పదం ఉత్పత్తి మరియు అర్థం
- The word “Society” is derived from the Latin root “Socius“, which translates to “Companion” or fellowship. Sociologically, society does not merely mean a collection of human beings; it refers to the complex pattern of the system of interactions and interrelations existing between them.
- తెలుగు: ‘Society’ అనే ఇంగ్లీష్ పదం ‘Socius‘ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం ‘సహచరుడు’ (Companion) లేదా స్నేహం (Fellowship). సమాజశాస్త్ర పరంగా, సమాజం అంటే కేవలం మనుషుల సమూహం లేదా గుంపు మాత్రమే కాదు; వారి మధ్య ఉండే పరస్పర సంబంధాలు, పరస్పర చర్యల యొక్క క్రమబద్ధమైన అమరికనే సమాజం అంటారు.
| Sociologist / శాస్త్రవేత్త | Core Definitional Statement / ముఖ్యమైన నిర్వచనం | Famous Book / ప్రసిద్ధ గ్రంథం |
| MacIver & Page | “Society is a web of social relationships.” | Society (1937) |
| (మెకైవర్ మరియు పేజ్) | (సామాజిక సంబంధాల వలయాన్నే సమాజం అంటారు.) | |
| A. W. Green | “Society is the largest permanent group of people who have common interests, a common way of life, and a sense of belonging.” | Sociology (1951) |
| (ఎ.డబ్ల్యూ. గ్రీన్) | (సమాజం అనేది ఒకే రకమైన ఆసక్తులు, జీవన విధానం కలిగి, చాలా కాలం పాటు కలిసి జీవిస్తూ తమను తాము ఒక ప్రత్యేక సమూహంగా గుర్తించుకునే వ్యక్తుల పెద్ద సమూహం.) | |
| Giddings | “Society is union itself, the organization, the sum of formal relations in which associating individuals are bound together.” | The Principles of Sociology (1896) |
| (గిడ్డింగ్స్) | (సమాజం అంటే సంఘటనం లేదా ఒక సంస్థ, కలిసి ఉండే వ్యక్తులను ఏకతాటిపైకి తెచ్చే అధికారిక సంబంధాల మొత్తమే సమాజం.) |
Structural Characteristics of Society / సమాజం యొక్క ముఖ్య లక్షణాలు
1. Likeness / సాదృశ్యం (సమానత్వం)
Likeness is an essential prerequisite for society. People cannot form a society unless they share similar physical or psychological attributes, common needs, and mutual goals. As MacIver noted: “Likeness is the beginning of society.”
సమాజం ఏర్పడటానికి మనుషుల మధ్య శారీరక, మానసిక పోలికలు లేదా సమానత్వం చాలా అవసరం. ఒకే రకమైన అవసరాలు, ఆలోచనలు ఉన్నప్పుడే సమాజం సాధ్యమవుతుంది. మ్యాక్ ఐవర్ ప్రకారం: “సాదృశ్యమే సమాజానికి పునాది/ప్రారంభం.
2. Difference / వైవిధ్యం (భేదం)
While likeness brings people together, difference makes society structured and functional. Society requires a Division of Labour based on sex, age, and professional skills (e.g., farmers, doctors, engineers). If everyone were identical, society would stagnate.
సమానత్వం మనుషులను ఒకచోటకు చేరిస్తే, వైవిధ్యం సమాజానికి ఒక రూపాన్ని ఇస్తుంది. సమాజంలో స్త్రీ-పురుష భేదం, వయస్సు భేదం, మరియు శ్రమ విభజన (Division of Labour) వంటి వైవిధ్యాలు ఉండాలి. అందరూ ఒకే పని చేస్తే సమాజం ముందుకు సాగదు.
3. Interdependence / పరస్పర ఆధారపడటం
No single individual or family is self-sufficient. Members of a society must depend on one another for survival, security, and economic goods.
సమాజంలో ఏ ఒక్క వ్యక్తి లేదా కుటుంబం ఒంటరిగా తమ అన్ని అవసరాలను తీర్చుకోలేరు. రక్షణ, ఆహారం, వస్తువుల కోసం మనుషులు నిరంతరం ఒకరిపై ఒకరు ఆధారపడతారు.
4. Cooperation & Conflict / సహకారం మరియు సంఘర్షణ
Cooperation is required at every step to build social order. However, competition and Conflict over scarce resources or power also naturally occur. Hence, sociology defines society as “Cooperation crossed by Conflict.”
సమాజ మనుగడకు పరస్పర సహకారం ప్రాథమిక అవసరం. అదే సమయంలో, పరిమితంగా ఉండే వనరులు లేదా అధికారం కోసం వ్యక్తుల మధ్య సంఘర్షణ కూడా జరుగుతుంది. అందుకే సమాజం అనేది “సహకారంతో కూడిన సంఘర్షణ”.
5. Abstract Nature / అమూర్త స్వభావం
While human beings are concrete (visible), the social relationships, values, and institutions that connect them cannot be seen or touched. Therefore, society is an abstract concept.
మనుషులు కంటికి కనిపిస్తారు (మూర్త రూపం), కానీ వారి మధ్య ఉండే ‘బంధాలు’, ‘సంబంధాలు’ కంటికి కనిపించవు. అందుకే సమాజం అనేది ఒక అమూర్త భావన (Abstract Concept).
6. Mutual Awareness/ పరస్పర అవగాహన
People in society are aware of one another.
సమాజంలోని వ్యక్తులు ఒకరినొకరు తెలుసుకొని ఉంటారు.
7. Social Relationships సామాజిక సంబంధాలు
Society is based on social relationships.
సమాజం సామాజిక సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
8. Common Culture సాధారణ సంస్కృతి
Members of society share common customs, traditions, and values.
సమాజంలోని ప్రజలు సంప్రదాయాలు, విలువలు, సంస్కృతిని పంచుకుంటారు.
Primary Functions of Society / సమాజం యొక్క ప్రాథమిక విధులు
1. Reproduction and Sustenance (సంతానోత్పత్తి & జీవనాధారం): Ensures the continuity of the human race through marriage and the family structure.
(వివాహం, కుటుంబ వ్యవస్థ ద్వారా కొత్త తరాన్ని అందిస్తూ సమాజం అంతరించిపోకుండా కాపాడుతుంది).
2. Socialization (సామాజికీకరణ): Transforms a biological infant into a social individual by teaching cultural norms, values, behaviour and languages.
(పుట్టిన పిల్లవాడికి సామాజిక నియమాలను, విలువలను, ప్రవర్తన ,భాషను నేర్పుతూ బాధ్యతాయుతమైన సభ్యుడిగా మారుస్తుంది).
3. Economic Maintenance (ఆర్థిక నిర్వహణ): Provisions food, shelter, and modern commodities via production and distribution networks.
(సభ్యులకు కావలసిన కూడు, గుడ్డ, నీడ కల్పించడానికి కావలసిన ఉత్పాదక, పంపిణీ వ్యవస్థలను నిర్వహిస్తుంది).
4. Social Control (సామాజిక నియంత్రణ): Regulates individual behaviour through formal laws and informal customs to prevent anarchy.
(చట్టాలు, ఆచారాల ద్వారా మనుషుల ప్రవర్తనను అదుపులో ఉంచి సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతుంది).
5. Protection and Security /రక్షణ మరియు భద్రత : Society provides protection to individuals.
సమాజం వ్యక్తులకు రక్షణ, భద్రత కల్పిస్తుంది.
6. Fulfilment of Needs /అవసరాల తీర్చడం : Society helps satisfy economic and social needs.
సమాజం ఆర్థిక మరియు సామాజిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.
7. Maintenance of Order /సామాజిక క్రమాన్ని నిర్వహించడం :Society maintains discipline and order.
సమాజం క్రమశిక్షణ మరియు సామాజిక క్రమాన్ని కాపాడుతుంది.
8. Development of Personality / వ్యక్తిత్వ వికాసం : Society helps in personality development.
వ్యక్తిత్వ అభివృద్ధికి సమాజం సహాయపడుతుంది.
9. Preservation of Culture / సంస్కృతి పరిరక్షణ : Society preserves customs and traditions.
సంప్రదాయాలు మరియు సంస్కృతిని సమాజం కాపాడుతుంది.
Classification & Types of Societies (సమాజాల వర్గీకరణ మరియు రకాలు)
Sociologists classify societies based on their technological advancement, economic systems, and evolutionary stages. Understanding these types is crucial for sorting timeline-based questions in competitive exams.
సమాజశాస్త్రవేత్తలు సమాజాలను సాంకేతిక అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థలు మరియు పరిణామ క్రమాల ఆధారంగా వివిధ రకాలుగా వర్గీకరించారు. పరీక్షల కోణంలో ఈ వర్గీకరణలు అత్యంత ముఖ్యం.
1.Gerhard Lenski’s Socio-Cultural Evolution / గెర్హార్డ్ లెన్స్కీ సాంస్కృతిక పరిణామ వర్గీకరణ
సాంకేతిక పరిజ్ఞానం (Technology) ఆధారంగా లెన్స్కీ సమాజాన్ని 5 చారిత్రక దశలుగా వర్గీకరించారు:
1.Hunting and Gathering Societies (వేట-సేకరణ సమాజం)
The earliest and simplest form of society. People relied on hunting wild animals and gathering wild plants. They were nomadic (moving from place to place), had small populations, and no social classes.
ఇది మానవ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన, సరళమైన సమాజం. వీరు వేట మరియు అడవి దుంపల సేకరణపై ఆధారపడేవారు. ఒకచోట స్థిరంగా ఉండకుండా వలసలు వెళ్లేవారు (Nomadic). ఇక్కడ ఎలాంటి సామాజిక తరగతులు లేదా ఆస్తి పంపిణీ ఉండేది కాదు.
2. Horticultural Societies (తోటల పెంపక సమాజం)
Hand tools (like hoes) were invented to cultivate crops. People started settling in semi-permanent villages, leading to the first signs of social inequality.
చేతి పరికరాల (ఉదాహరణకు తొలి రకం గొడ్డలి, పార) సహాయంతో చిన్న తరహా తోటల పెంపకం లేదా సాగు ప్రారంభించారు. మనుషులు ఒకచోట పాక్షికంగా స్థిరపడటం ఈ దశలోనే మొదలైంది.
3.Pastoral Societies (పశుపోషణ సమాజం)
Based on the domestication of animals (cattle, sheep) for food and transport. Found mostly in arid regions where crops couldn’t grow. Surplus resources led to early trading.
ఆహారం మరియు రవాణా కోసం జంతువులను (పశువులు, గొర్రెలు) మచ్చిక చేసుకోవడం ఈ సమాజాల ముఖ్య లక్షణం. పండని ప్రాంతాలలో ఇవి ఎక్కువగా ఉండేవి. ఇక్కడే మిగులు ఉత్పత్తి (Surplus) మరియు వ్యాపారం చిగురించాయి.
4.Agrarian / Agricultural Societies (వ్యవసాయ సమాజం)
Invented the Plough (నాగలి) driven by animal power. Large-scale farming led to massive food surpluses, permanent cities, empires, and extreme social stratification (zamindars/peasants).
జంతువుల సహాయంతో నడిచే నాగలి ఆవిష్కరణ ఇక్కడ టర్నింగ్ పాయింట్. పెద్ద ఎత్తున వ్యవసాయం చేయడం వల్ల శాశ్వత నగరాలు, సామ్రాజ్యాలు మరియు తీవ్రమైన సామాజిక అసమానతలు (భూస్వాములు – రైతులు) ఏర్పడ్డాయి.
5.Industrial Societies (పారిశ్రామిక సమాజం)
Driven by mechanical power (steam engines, electricity, machines) instead of human/animal power. Led to rapid urbanization, family nuclearization, and the rise of the capitalist class.
మానవ లేదా జంతు శ్రమ స్థానంలో యంత్రాల శక్తి (ఆవిరి యంత్రాలు, విద్యుత్) ప్రవేశించింది. విపరీతమైన పట్టణీకరణ, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, మరియు పెట్టుబడిదారీ వర్గం ఇక్కడ ఆవిర్భవించాయి.
6.Post-Industrial Societies (పారిశ్రామికానంతర / సమాచార సమాజం)
Economies shifted from manufacturing goods to providing services and information technology (computers, microchips). Knowledge is the main source of power.
ఇది వస్తువుల ఉత్పత్తి నుండి సేవలు మరియు ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగం వైపు మారిన ఆధునిక సమాజం. ఇక్కడ ‘జ్ఞానం’ లేదా సమాచారమే అసలైన శక్తి.
2.Lewis Henry Morgan – Evolutionary Classification of Society(లూయిస్ హెన్రీ మోర్గాన్ – సామాజిక పరిణామ క్రమ వర్గీకరణ)
Lewis Henry Morgan was a 19th-century evolutionary anthropologist. He argued that human society has evolved through a single, universal line of progress, divided into three main stages: Savagery, Barbarism, and Civilization. He further divided the first two stages into Upper, Middle, and Lower substages based on technological inventions.
19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ మానవశాస్త్రవేత్త లూయిస్ హెన్రీ మోర్గాన్ మానవ సమాజం ఒకే సరళరేఖ మార్గంలో (Unilineal Evolution) పరిణామం చెందిందని నమ్మారు. ఆయన సమాజ ప్రగతిని మూడు ప్రధాన దశలుగా విభజించారు: వన్యదశ (Savagery), బార్బరిజం/మృగదశ (Barbarism), మరియు నాగరికత (Civilization). సాంకేతిక ఆవిష్కరణల ఆధారంగా మొదటి రెండు దశలను మరల దిగువ, మధ్య, ఎగువ ఉప-దశలుగా వర్గీకరించారు.
The Three Main Stages & Substages / మూడు ప్రధాన దశలు మరియు ఉప-దశలు
1. Savagery (వన్యదశ) — The Infant Period of Humanity
ఇది మానవజాతి యొక్క అత్యంత ప్రాచీనమైన, కఠినమైన తొలి దశ.
- Lower Savagery (దిగువ వన్యదశ): Man lived in trees/caves, subsisting on fruits and nuts. Speech (భాష) ఆవిర్భావం ఇక్కడే జరిగింది.
- Middle Savagery (మధ్య వన్యదశ): Began with the utilization of Fire (నిప్పు) and catching fish. Man gained mobility.
- Upper Savagery (ఎగువ వన్యదశ): Marked by the invention of the Bow and Arrow (విల్లు మరియు బాణం). Hunting became more efficient.
2. Barbarism (బార్బరిజం / మృగదశ) — The Transition Period
వేట దశ నుండి మానవుడు స్థిర నివాసం వైపు అడుగులు వేసిన కాలమిది.
- Lower Barbarism (దిగువ బార్బరిజం): Marked by the invention of Pottery (కుండల తయారీ). Food storage began.
- Middle Barbarism (మధ్య బార్బరిజం): Characterized by the domestication of animals (cattle/pastoralism) in the Eastern hemisphere, and irrigation/cultivation of maize in the Western hemisphere. (తూర్పు దేశాలలో పశుపోషణ, పశ్చిమ దేశాలలో నీటిపారుదల సహాయంతో వ్యవసాయం ప్రారంభం).
- Upper Barbarism (ఎగువ బార్బరిజం): Began with the smelting of Iron (ఇనుము తయారీ/కరిగించడం). Tools and weapons became extremely strong.
3.Civilization (నాగరికత) — The Modern Era
This stage began with the invention of the Phonetic Alphabet and Writing (లిపి మరియు అక్షరాస్యత). Literary records, large cities, codification of laws, and modern state structures emerged here.
అక్షర రూపం లేదా లిపి ఆవిష్కరణతో ఈ నాగరికతా యుగం ప్రారంభమైంది. రాతపూర్వక రికార్డులు, పెద్ద నగరాలు, చట్టాల నిర్మాణం మరియు ఆధునిక ప్రభుత్వాలు ఈ దశలోనే ఏర్పడ్డాయి.
Quick Revision Summary Matrix / ఎగ్జామ్ షార్ట్‌కట్ టేబుల్
| Sociologist / శాస్త్రవేత్త | Types of Societies / సమాజాల రకాలు | Core Criteria / ప్రాతిపదిక |
| Auguste Comte (ఆగస్ట్ కామ్టే) | 1. Theological (దైవధార్మిక) | Intellectual Evolution (మానవ ఆలోచనా పరిణామం) |
| 2. Metaphysical (తాత్విక) | ||
| 3. Positive/Scientific (శాస్త్రీయ) | ||
| Karl Marx (కార్ల్ మార్క్స్) | 1. Primitive Communism | Modes of Production & Class Conflict(ఉత్పాదక పద్ధతులు & వర్గ పోరాటం) |
| 2. Ancient (Slavery) | ||
| 3. Feudal | ||
| 4. Capitalist | ||
| Robert Redfield (రాబర్ట్ రెడ్‌ఫీల్డ్) | 1. Folk Society (జానపద సమాజం) | Cultural Continuum (సంస్కృతి యొక్క కొనసాగింపు) |
| 2. Urban Society (నగర సమాజం) | ||
| Karl Popper (కార్ల్ పాపర్) | 1. Open Society (సహన/ముక్త సమాజం) | Freedom and Democracy (వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యం ) |
| 2. Closed Society (బంధిత సమాజం) |
3.Ferdinand Tönnies – Gemeinschaft and Gesellschaft
ఫెర్డినాండ్ టోన్నీస్ – గెమైన్‌షాఫ్ట్ మరియు గెజెల్‌షాఫ్ట్
German sociologist Ferdinand Tönnies, in his path-breaking book Gemeinschaft und Gesellschaft (1887), classified societies into two distinct ideal types based on the nature of social ties, relationships, and human willpower.
జర్మన్ సమాజశాస్త్రవేత్త ఫెర్డినాండ్ టోన్నీస్ 1887లో ప్రచురించిన తన ‘గెమైన్‌షాఫ్ట్ ఉండ్ గెజెల్‌షాఫ్ట్’ అనే గ్రంథంలో సామాజిక సంబంధాల స్వభావం మరియు మనుషుల ఇష్టాయిష్టాల ఆధారంగా సమాజాలను రెండు స్పష్టమైన రకాలుగా వర్గీకరించారు.
1. Gemeinschaft (Community / సామాజిక సమూహం లేదా సమాజం)
Meaning: It translates closely to “Community”.
Nature of Relationships: Relationships are intimate, personal, face-to-face, and enduring. They are based on emotional ties, mutual trust, and shared values.
Where it exists: Traditional rural villages, primitive tribes, and close-knit families.
Key Driving Force: Natural Will – People stay together naturally out of affection, instinct, and a sense of belonging, not for personal gain.
దీనిని “సముదాయం” లేదా సాంప్రదాయ గ్రామీణ సమాజంగా పేర్కొనవచ్చు. ఇక్కడ సంబంధాలు అత్యంత సన్నిహితంగా, వ్యక్తిగతంగా, ముఖాముఖిగా మరియు శాశ్వతంగా ఉంటాయి. ఇవి పరస్పర నమ్మకం, భావోద్వేగాలు మరియు ఒకే రకమైన సంస్కృతిపై ఆధారపడతాయి.
ఉదాహరణ: పాత గ్రామాలు, కుటుంబ వ్యవస్థ, గిరిజన తెగలు. ఇక్కడ మనుషులు “సహజ సంకల్పం” (Natural Will) తో కలిసి ఉంటారు.
2. Gesellschaft (Society / సంఘం లేదా అసోసియేషన్)
Meaning: It translates closely to “Society” or “Association”.
Nature of Relationships: Relationships are impersonal, formal, contractual, and temporary. People interact only to achieve specific self-interests or business goals.
Where it exists: Modern industrial cities, large corporations, and global markets.
Key Driving Force: Rational Will – Connections are calculated, instrumental, and based on logic, law, and economic exchange.
దీనిని “సంఘం” లేదా ఆధునిక పారిశ్రామిక నగర సమాజంగా చెప్పవచ్చు. ఇక్కడ సంబంధాలు లాంఛనప్రాయంగా (Formal), కృత్రిమంగా, ఒప్పందాల ఆధారంగా (Contractual) మరియు తాత్కాలికంగా ఉంటాయి. మనుషులు కేవలం తమ స్వప్రయోజనాల కోసమే ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటారు.
ఉదాహరణ: ఆధునిక నగరాలు, పెద్ద కార్పొరేట్ కంపెనీలు, స్టాక్ మార్కెట్. ఇక్కడ మనుషులు “హేతుబద్ధ సంకల్పం” (Rational Will) తో లాభనష్టాలు చూసుకుని కనెక్ట్ అవుతారు.
High-Yield Comparison Matrix / ఎగ్జామ్ షార్ట్‌కట్ టేబుల్
| Feature / లక్షణం | Gemeinschaft (గెమైన్‌షాఫ్ట్) | Gesellschaft (గెజెల్‌షాఫ్ట్) |
| English Equivalent | Community (సముదాయం) | Society / Association (సంఘం) |
| Social Environment | Rural / Village (గ్రామీణ) | Urban / Industrial City (నగర/పారిశ్రామిక) |
| Relationships | Personal & Emotional (వ్యక్తిగత) | Impersonal & Contractual (లాంఛనప్రాయ) |
| Willpower Type | Natural Will / Wesenwille (సహజ) | Rational Will / Kürwille (హేతుబద్ధ) |
| Social Control | Customs & Religion (ఆచారాలు/మతం) | Written Laws & Police (లిఖిత చట్టాలు) |
4. Emile Durkheim’s Mechanical & Organic Solidarity (మెకానికల్ & ఆర్గానిక్ సంఘీభావం)
ఫ్రెంచ్ సమాజశాస్త్రవేత్త ఎమిలి డీర్ఖైమ్ (Emile Durkheim) తన ప్రసిద్ధ గ్రంథం The Division of Labour in Society (1893) లో సమాజం ఎలా కలిసికట్టుగా ఉంటుంది (Social Cohesion) అనే అంశాన్ని వివరిస్తూ రెండు రకాల సంఘీభావాలను (Solidarity) పేర్కొన్నారు.
1. Mechanical Solidarity (యాంత్రిక సంఘీభావం)
Where it exists: Primitive, tribal, or ancient rural societies. (ఆదిమ, గిరిజన లేదా ప్రాచీన గ్రామీణ సమాజాలు).
Nature: Low Division of Labour (శ్రమ విభజన చాలా తక్కువ). Everyone performs similar tasks (వ్యవసాయం, వేట మొదలైనవి అందరూ చేస్తారు).
Mindset: High Collective Consciousness (సామూహిక స్పృహ చాలా ఎక్కువ). సమాజంలోని నియమాలను అందరూ గుడ్డిగా, యంత్రాల లాగా పాటిస్తారు. వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు.
Law Type: Repressive Laws (శిక్షాత్మక చట్టాలు). తప్పు చేస్తే సమాజం మొత్తానికి ద్రోహం చేసినట్లు భావించి కఠినమైన, శారీరక శిక్షలు వేస్తారు.
2. Organic Solidarity (సజీవవయవ / ఆర్గానిక్ సంఘీభావం)
Where it exists: Modern, industrial, and urban societies. (ఆధునిక, పారిశ్రామిక మరియు నగర సమాజాలు).
Nature: High Division of Labour & Specialization (అత్యధిక శ్రమ విభజన మరియు నైపుణ్యం). ఒకరు డాక్టర్, ఒకరు ఇంజనీర్, ఒకరు రైతు – ప్రతి ఒక్కరి పని వేరు.
Interdependence: Just like the heart depends on the lungs, in modern society, a doctor depends on a farmer, a farmer on an engineer… they are interdependent on each other. This is what holds society together
జస్ట్ లైక్ గుండె ఊపిరితిత్తులపై ఆధారపడినట్లు, ఆధునిక సమాజంలో డాక్టర్ రైతుపై, రైతు ఇంజనీర్‌పై… ఇలా ఒకరిపై ఒకరు పరస్పర ఆధారపడతారు (Interdependence). ఇందువల్లే సమాజం కలిసి ఉంటుంది.
Law Type: Restitutive Laws (పునరుద్ధరణ చట్టాలు). Punishments here are like paying damages or reinstatement (civil laws).
ఇక్కడ శిక్షలు నష్టపరిహారం చెల్లించడం లేదా పూర్వ స్థితికి తీసుకురావడం (సివిల్ చట్టాలు) లాగా ఉంటాయి
Short Exam Note
Gerhard Lenski( గెర్హార్డ్ లెన్స్కి)
Hunting & Gathering → Horticultural →Pastoral Societies →Agrarian → Industrial → Post-Industrial Society
వృత్తి మరియు అభివృద్ధి ఆధారంగా సమాజాలను>>> వేట సమాజం→తోటల పెంపక సమాజం → పశుపోషణ సమాజం → వ్యవసాయ సమాజం→పారిశ్రామిక సమాజం→ పోస్ట్ పారిశ్రామిక సమాజం
Lewis Henry Morgan ( లూయిస్ హెన్రీ మోర్గాన్)
అనాగరిక దశ (Savagery) → అర్ధ నాగరిక దశ (Barbarism) → నాగరిక దశ (Civilization)
Ferdinand Tönnies (ఫెర్డినాండ్ టోనీస్)
Gemeinschaft (సముదాయ సమాజం) → సంప్రదాయ సమాజం
Gesellschaft (సంఘ సమాజం) → ఆధునిక సమాజం
Émile Durkheim (ఎమిలే డర్కీమ్)
Mechanical Solidarity (యాంత్రిక సంఘీభావం) → సంప్రదాయ సమాజం
Organic Solidarity (సజీవ సంఘీభావం) → ఆధునిక పారిశ్రామిక సమాజం
MCQ’S
Q1. Who classified societies into ‘Open Society’ and ‘Closed Society’? సమాజాలను ‘ముక్త సమాజం’ (Open Society) మరియు ‘బంధిత సమాజం’ (Closed Society) గా వర్గీకరించినది ఎవరు?
A) Karl Marx (కార్ల్ మార్క్స్)
B) Karl Popper (కార్ల్ పాపర్)
C) Robert Redfield (రాబర్ట్ రెడ్‌ఫీల్డ్)
D) Gerhard Lenski (గెర్హార్డ్ లెన్స్కీ)
Show Answer
✅Answer: B) Karl Popper (కార్ల్ పాపర్)
Q2. In which type of society according to Gerhard Lenski did the invention of the “Plough” take place? గెర్హార్డ్ లెన్స్కీ వర్గీకరణ ప్రకారం, “నాగలి” ఆవిష్కరణ ఏ రకమైన సమాజంలో జరిగింది?
A) Horticultural Society (తోటల పెంపక సమాజం)
B) Pastoral Society (పశుపోషణ సమాజం)
C) Agrarian Society (వ్యవసాయ సమాజం)
D) Industrial Society (పారిశ్రామిక సమాజం)
Show Answer
✅Answer: C) Agrarian Society (వ్యవసాయ సమాజం)
Q3. Match the following correctly: / క్రింది వాటిని సరిగ్గా జతపరచండి:
Auguste Comte —- i. Folk & Urban Society (జానపద మరియు పట్టణ సమాజం)
Robert Redfield —- ii. Capitalist Society (పెట్టుబడిదారీ సంఘం)
Karl Marx —- iii. Positive/Scientific Stage( సానుకూల/శాస్త్రీయ దశ)
A) 1-i, 2-ii, 3-iii
B) 1-iii, 2-i, 3-ii
C) 1-ii, 2-iii, 3-i
D) 1-iii, 2-ii, 3-i
Show Answer
✅Answer: B) 1-iii, 2-i, 3-ii
Q4. In which book did Lewis Henry Morgan propose his evolutionary classification of society? లూయిస్ హెన్రీ మోర్గాన్ ఏ గ్రంథంలో తన సమాజ పరిణామ క్రమ వర్గీకరణను ప్రతిపాదించారు?
- A) Social Structure / సామాజిక నిర్మాణం
- B) Ancient Society / ప్రాచీన సమాజం
- C) The Rules of Sociological Method / సామాజిక శాస్త్ర పద్ధతి నియమాలు
- D) Primitive Culture / ఆదిమ సంస్కృతి
Show Answer
✅Answer: B) Ancient Society / ప్రాచీన సమాజం (Written in 1877)
Q5. According to L.H. Morgan, the invention of the “Bow and Arrow” marks which stage of human society? ఎల్.హెచ్. మోర్గాన్ ప్రకారం, “విల్లు మరియు బాణం” ఆవిష్కరణ మానవ సమాజం యొక్క ఏ దశను సూచిస్తుంది?
- A) Middle Savagery / మధ్య వన్యదశ
- B) Upper Savagery / ఎగువ వన్యదశ
- C) Lower Barbarism / దిగువ అనాగరికత
- D) Upper Barbarism / ఎగువ అనాగరికత
Show Answer
✅Answer: B) Upper Savagery / ఎగువ వన్యదశ
Q6. Match the following correctly based on Morgan’s stages: మోర్గాన్ దశల ఆధారంగా క్రింది వాటిని సరిగ్గా జతపరచండి:
- Middle Savagery (మధ్య వన్యదశ) —- i. Pottery (కుండలు)
- Lower Barbarism (దిగువ అనాగరికత) —- ii. Alphabet/Writing (లిపి)
- Civilization (నాగరికత) —- iii. Utilization of Fire (నిప్పు)
A) 1-i, 2-ii, 3-iii
B) 1-iii, 2-i, 3-ii
C) 1-ii, 2-iii, 3-i
D) 1-iii, 2-ii, 3-i
Show Answer
✅Answer: B) 1-iii, 2-i, 3-ii
Q7. Who classified society into ‘Gemeinschaft‘ and ‘Gesellschaft‘? సమాజాలను ‘గెమైన్‌షాఫ్ట్’ మరియు ‘గెజెల్‌షాఫ్ట్’ గా వర్గీకరించిన సమాజశాస్త్రవేత్త ఎవరు?
A) Max Weber / మాక్స్ వెబర్
B) Ferdinand Tönnies / ఫెర్డినాండ్ టోనీస్
C) Karl Marx / కార్ల్ మార్క్స్
D) Emile Durkheim / ఎమిలే డర్కీమ్
Show Answer
✅Answer: B) Ferdinand Tönnies / ఫెర్డినాండ్ టోనీస్ (In the year 1887)
Q8. In which type of society according to Ferdinand Tönnies are social relationships formal, impersonal, and contractual? ఫెర్డినాండ్ టోన్నీస్ ప్రకారం, ఏ రకమైన సమాజంలో సామాజిక సంబంధాలు లాంఛనప్రాయంగా, కృత్రిమంగా మరియు ఒప్పందాల ఆధారంగా ఉంటాయి?
A) Gemeinschaft
B) Gesellschaft
C) Feudal Society / ఫ్యూడల్ సొసైటీ
D) Tribal Society / గిరిజన సంఘం
Show Answer
✅Answer: B) Gesellschaft
Q9.Match the terms postulated by Ferdinand Tönnies correctly: ఫెర్డినాండ్ టోన్నీస్ ప్రతిపాదించిన పదాలను సరిగ్గా జతపరచండి:
1. Gemeinschaft —- i. Rational Will (Kürwille) / ఆధునిక నగరం
2.Gesellschaft —- ii. Natural Will (Wesenwille) / పల్లెటూరు
A) 1-i, 2-ii
B) 1-ii, 2-i
Show Answer
✅Answer: B) 1-ii, 2-i
Q10. According to Emile Durkheim, modern industrial societies are characterized by which type of solidarity? / ఎమిలి డీర్ఖైమ్ ప్రకారం, ఆధునిక పారిశ్రామిక సమాజాలు ఏ రకమైన సంఘీభావాన్ని కలిగి ఉంటాయి?
A) Mechanical Solidarity / యాంత్రిక సంఘీభావం
B) Organic Solidarity / ఆర్గానిక్ సంఘీభావం
C) Traditional Solidarity / సాంప్రదాయ సంఘీభావం
D) Chemical Solidarity / రసాయనిక సంఘీభావం
Show Answer
✅Answer: B) Organic Solidarity / ఆర్గానిక్ సంఘీభావం
Q11. “Repressive Laws” are predominantly found in societies with which solidarity? / “శిక్షాత్మక చట్టాలు” ప్రధానంగా ఏ రకమైన సంఘీభావం ఉన్న సమాజాలలో కనిపిస్తాయి?
A) Organic Solidarity /సేంద్రీయ సాలిడారిటీ
B) Mechanical Solidarity /మెకానికల్ సాలిడారిటీ
C) Modern Society/ఆధునిక సమాజం
D) Industrial Society/ఇండస్ట్రియల్ సొసైటీ
Show Answer
✅Answer: B) Mechanical Solidarity/ మెకానికల్ సాలిడారిటీ