Man & Society

Introduction / పరిచయం

The relationship between man and society is a fundamental puzzle in sociology. Aristotle famously stated, “Man is a social animal.” An individual cannot develop personality, language, or culture without society. Conversely, without individuals, society cannot exist. They are two sides of the same coin.

మానవునికి, సమాజానికి మధ్య గల సంబంధం అత్యంత విడదీయరానిది. ప్రముఖ గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ “మానవుడు ఒక సంఘజీవి” అని పేర్కొన్నారు. సమాజం లేకుండా మనిషి తన వ్యక్తిత్వాన్ని, భాషను, సంస్కృతిని వృద్ధి చేసుకోలేడు. సమాజం లేకపోతే మానవుడు లేడు, మానవుడు లేకపోతే సమాజం లేదు.

Human Society vs. Animal Society / మానవ సమాజం వర్సెస్ జంతు సమాజం

In competitive exams like CDPO, a statement-based question comparing these two is highly probable.

Feature (లక్షణం)
Human Society (మానవ సమాజం)
Animal Society (జంతు సమాజం)
Basis (ఆధారం)Based on Culture and learning. (సంస్కృతి, నేర్చుకోవడంపై ఆధారపడుతుంది)Based on Instinct and biology. (సహజాతాలు, జీవశాస్త్రంపై ఆధారపడుతుంది)
Communication (భావవ్యక్తీకరణ)Uses symbolic language and abstract words. (సంకేతాలు, లిపి, స్పష్టమైన భాషను వాడుతుంది)Uses specific sounds, calls, or chemical signs. (శబ్దాలు, కొన్ని సంకేతాలకే పరిమితం)
Adaptation (సర్దుబాటు)Alters the environment to suit needs (Dynamic). (పరిసరాలను మార్చుకోగలదు)Alters itself biologically to suit the environment. (పరిసరాలకు అనుగుణంగా తనే మారుతుంది)
Division of Labor (శ్రమ విభజన)Based on training, skill, and choices. (శిక్షణ, నైపుణ్యాల ఆధారంగా మారుతుంది)Fixed biologically (e.g., Ants, Bees). (జీవశాస్త్రపరంగా ముందే నిర్ణయించబడి ఉంటుంది)

Importance of Society to Man (మనిషికి సమాజం యొక్క ప్రాముఖ్యత)

1. Provides security

2. Helps personality development

3. Gives education and culture

4. Creates discipline

5. Helps economic activities

1. భద్రతను కల్పిస్తుంది

2. వ్యక్తిత్వ వికాసానికి సహాయపడుతుంది

3. విద్య మరియు సంస్కృతిని అందిస్తుంది

4. క్రమశిక్షణను పెంపొందిస్తుంది

5. ఆర్థిక కార్యకలాపాలకు సహకరిస్తుంది

6. సామాజిక విలువలు మరియు నైతికతను నేర్పిస్తుంది

7. సహకారం మరియు ఐక్యతను పెంచుతుంది

8. మనిషి అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది

Theories of the Relationship / మానవుడు – సమాజం: సిద్ధాంతాలు

Sociologists explain this relationship through three main contrasting theories that frequently appear in exams:

1. Social Contract Theory (సామాజిక ఒప్పంద సిద్ధాంతం)

2. The Group Mind Theory (సమూహ మనస్సు సిద్ధాంతం)

3. Organic Theory / Organismic Theory (జీవవయవ సిద్ధాంతం)

1. Social Contract Theory (సామాజిక ఒప్పంద సిద్ధాంతం)

The Social Contract Theory posits that society is not natural or organic, but a deliberate human creation. To understand this, the thinkers use a hypothetical construct called the “State of Nature” (the condition of humanity before society and government existed).

సమాజం అనేది సహజంగా ఏర్పడింది కాదు, అది మానవులందరూ కలిసి ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం సృష్టించుకున్న ఒక కల్పిత లేదా కృత్రిమ వ్యవస్థ అని సామాజిక ఒప్పంద సిద్ధాంతం చెప్తుంది. ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, సమాజం ఏర్పడకముందు మనుషులు ఎలా జీవించేవారో ఊహించే “ప్రాకృతిక వ్యవస్థ” (State of Nature) అనే భావనను మనం తెలుసుకోవాలి.

Main Thinkers of Social Contract Theory

1. Thomas Hobbes

2. John Locke

3. Jean-Jacques Rousseau

1. Thomas Hobbes (1588–1679)

The Concept: Hobbes had a pessimistic view of human nature. He believed humans are naturally selfish, cruel, and driven by a desire for power.

హాబ్స్ ప్రకారం మానవుడు పుట్టుకతోనే అత్యంత స్వార్థపరుడు, క్రూరుడు, అధికార దాహం కలిగినవాడు.

State of Nature: He described life in the state of nature as “solitary, poor, nasty, brutish, and short.” It was a state of constant war of all against all 

ప్రాకృతిక వ్యవస్థ: సమాజం, చట్టాలు లేని ఆ కాలంలో మానవ జీవితం “ఒంటరిగా, దౌర్భాగ్యంగా, అసహ్యంగా, మృగప్రాయంగా, అతి స్వల్పంగా” ఉండేది. అది ఒకరితో ఒకరు నిరంతరం యుద్ధం చేసుకునే పరిస్థితి

The Contract: To escape this misery, individuals surrendered all their natural rights to a single ruler or assembly (The Sovereign) in exchange for physical protection and law.

ఒప్పందం: ఈ భయంకరమైన అరాచకం నుండి తప్పించుకోవడానికి, ప్రజలందరూ తమ “సహజ హక్కులను” ఒకే ఒక పాలకుడికి (Sovereign/Leviathen) అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నారు. బదులుగా ఆ పాలకుడు వారికి రక్షణ కల్పిస్తాడు. ఇక్కడ పాలకుడికి తిరుగులేని నిరంకుశ అధికారం ఉంటుంది.

Famous Book: Leviathan (1651).

ప్రసిద్ధ గ్రంథం: లెవియాథన్ (Leviathan – 1651).

Example/Analogy: Think of a lawless, war-torn region ruled by local warlords. People willingly accept a strict authoritarian dictator just to stop the daily bloodshed.

ఉదాహరణ: ఒక ప్రాంతంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించి, దొంగలు, దోపిడీదారుల రాజ్యం నడుస్తున్నప్పుడు… ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఒక కఠినమైన సైనిక పాలకుడి (Dictator) కి లొంగిపోవడానికి సిద్ధపడటం లాంటిది ఇది.

2. John Locke (1632–1704)

The Concept: Locke had an optimistic view. He believed humans are naturally rational, social, and cooperative.

మానవ స్వభావం: లాక్ ప్రకారం మానవుడు పుట్టుకతోనే వివేకవంతుడు, శాంతి కాముకుడు, ఇతరులతో కలిసి జీవించే గుణం కలవాడు.

State of Nature: A state of peace, goodwill, and mutual assistance. However, it lacked established, known laws and impartial judges to settle disputes.

ప్రాకృతిక వ్యవస్థ (State of Nature): ఈ కాలంలో ప్రజలు ప్రశాంతంగా, పరస్పర సహకారంతోనే జీవించారు. కానీ, అక్కడ వివాదాలు వస్తే పరిష్కరించడానికి ఒక నిర్దిష్టమైన చట్టం లేదా ఒక నిష్పాక్షికమైన న్యాయమూర్తి లేరు. ఆ ఒక్క లోపం వల్లే అభద్రత ఏర్పడింది.

The Contract: Individuals did not surrender all rights. They retained their Natural Rights to Life, Liberty, and Property. They only gave up the right to execute the law to a government. If the government fails to protect these rights, people have the Right to Revolt.

ఒప్పందం (The Contract): ప్రజలు తమ హక్కులన్నింటినీ ప్రభుత్వానికి ఇవ్వలేదు. కేవలం చట్టాలను అమలు చేసే అధికారాన్ని మాత్రమే ఇచ్చారు. మనిషికి పుట్టుకతో వచ్చే “జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, ఆస్తి హక్కు” (Life, Liberty, Property) అనే మూడు సహజ హక్కులను ఏ ప్రభుత్వమూ లాక్కోలేదు. ఒకవేళ ప్రభుత్వం ఈ హక్కులను రక్షించడంలో విఫలమైతే, ఆ ప్రభుత్వాన్ని కూల్చే హక్కు (Right to Revolt) ప్రజలకు ఉంటుంది.

Famous Book: Two Treatises of Government (1689).

ప్రసిద్ధ గ్రంథం: టూ ట్రీటీసెస్ ఆఫ్ గవర్నమెంట్ (Two Treatises of Government – 1689).

Example/Analogy: Modern democracies like India or the US. Citizens pay taxes and obey laws, but if the government violates basic fundamental rights, citizens can vote them out or protest.

ఉదాహరణ: ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు (భారతదేశం లేదా అమెరికా). మనం ప్రభుత్వానికి పన్నులు కడతాం, చట్టాలు పాటిస్తాం. కానీ ప్రభుత్వం మన ప్రాథమిక హక్కులను కాలరాస్తే, వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి ఆ ప్రభుత్వాన్ని మార్చేస్తాం.

3. Jean-Jacques Rousseau జీన్ జాక్వెస్ రూసో (1712–1778)

 The Concept: Rousseau believed man is born pure but is corrupted by society and civilization.

మానవ స్వభావం: రూసో ప్రకారం మనిషి పవిత్రమైనవాడు. కానీ ఈ ఆధునిక సమాజం, నాగరికతే అతడిని చెడగొట్టాయి.

State of Nature: He called the primitive man a “Noble Savage”—innocent, completely free, happy, and isolated.

ప్రాకృతిక వ్యవస్థ (State of Nature): ప్రాకృతిక వ్యవస్థలో మనిషి ఒక “నోబెల్ సావేజ్” (Noble Savage – పవిత్రమైన అనాగరికుడు) లాగా జీవించాడు. అతనికి ఏ స్వార్థం లేదు, అడవిలో సంపూర్ణ స్వేచ్ఛతో, ఆనందంగా బ్రతికాడు.

The Contract: The introduction of private property ruined this paradise, creating inequality and greed. To fix this, individuals joined together to form a contract based on the “General Will” (the collective interest of the community as a whole).

ఒప్పందం (The Contract): ఎప్పుడైతే సమాజంలో “ఇది నా భూమి, నా ఆస్తి” అనే ప్రైవేట్ ఆస్తి భావన వచ్చిందో, అప్పటినుండి అసూయ, స్వార్థం, అసమానతలు మొదలయ్యాయి. దీనిని సరిదిద్దడానికి మనుషులంతా కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా “జనరల్ విల్” (General Will – సామూహిక సంకల్పం) ఏర్పడింది. అంటే, సమాజం అంతటికీ మేలు జరిగేలా అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడం.

Famous Book: The Social Contract ది సోషల్ కాంట్రాక్ట్ (1762).

Famous Statement: “Man is born free, and everywhere he is in chains.”

ప్రసిద్ధ వ్యాఖ్యానం: “మానవుడు స్వేచ్ఛగా జన్మిస్తాడు, కానీ సర్వత్రా సంకెళ్లతో బంధింపబడి ఉంటాడు.

Example/Analogy: A small tribal village council (Gram Sabha) where every villager votes directly on rules that benefit the entire village community, sacrificing individual greed for the common good.

ఉదాహరణ: ఒక చిన్న గిరిజన గ్రామంలో ఉండే ‘గ్రామ సభ’. అక్కడ ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టి, ఊరందరికీ మేలు జరిగే చట్టాల కోసం చేతులెత్తి ఓటు వేస్తారు.

Thinker (శాస్త్రవేత్త)
Human Nature (మానవ స్వభావం)
State of Nature (సమాజం ముందరి స్థితి)
Core Concept (ముఖ్య సిద్ధాంతం)
Famous Book (పుస్తకం)
HobbesSelfish & Brutish (స్వార్థపూరితం)War of all against all (నిరంతర ఘర్షణ)Absolute Sovereignty / Dictatorship (నిరంకుశత్వం)Leviathan
LockeRational & Social (వివేకవంతమైనది)Peaceful but disorganized (ప్రశాంతం కానీ అస్తవ్యస్తం)Limited Government & Natural Rights (సహజ హక్కులు)Two Treatises of Government
RousseauInnocent / Noble Savage (పవిత్రమైనది)Perfect freedom and happiness (పరిపూర్ణ ఆనందం)General Will / Collective Voice (జనరల్ విల్)The Social Contract

Criticisms of Social Contract Theory (సిద్ధాంతంపై విమర్శలు)

In exams, you may encounter questions like: “Which of the following is a criticism of the Social Contract Theory?”

1. Historically False: There is zero historical evidence or archaeological proof that primitive humans ever met in a forest to sign a formal contract.

1. చారిత్రక ఆధారాలు లేవు: చరిత్రలో ఎప్పుడూ కూడా ఆదిమ మానవులు ఒక చోట సమావేశమై ఇలాంటి ‘బాండ్ పేపర్’ మీద సంతకాలు చేసి సమాజాన్ని నిర్మించిన దాఖలాలు లేవు. ఇది కేవలం ఒక కల్పిత ఊహ మాత్రమే.

2. Bad Logic: To sign a contract, people must already understand laws, rights, and language. If they already understood those things, a society effectively already existed! A contract cannot create society out of nowhere.

2. తార్కిక లోపం (Bad Logic): ఒక ఒప్పందం చేసుకోవాలంటే మనుషులకు ముందే భాష, చట్టాలు, హక్కుల పట్ల అవగాహన ఉండాలి. అవన్నీ ముందే ఉంటే, అక్కడ అప్పటికే సమాజం ఉన్నట్టే లెక్క! కాబట్టి ఒప్పందం వల్ల సమాజం రాలేదు.

3. Society is Growth, Not a Manufacture: As Sir Henry Maine stated, society evolved slowly over thousands of years through kinship and religion; it was not manufactured overnight by an agreement.

3. సమాజం పరిణామ క్రమం: సర్ హెన్రీ మెయిన్ (Sir Henry Maine) ప్రకారం, సమాజం అనేది ఒక రాత్రిలో కుదిరిన ఒప్పందం వల్ల పుట్టింది కాదు; అది వేల సంవత్సరాల పాటు రక్తసంబంధం, మతం ఆధారంగా నెమ్మదిగా వికసించిన ఒక పరిణామం.

2. The Group Mind Theory (సమూహ మనస్సు సిద్ధాంతం)

This is an essential addition that bridges psychology and sociology. It explains how a collection of individuals begins to think acts as a single organism.

ఈ సిద్ధాంతం సమాజశాస్త్రానికి, మనస్తత్వశాస్త్రానికి (Psychology) మధ్య ఒక వారధి లాంటిది.

Key Proponents: Gustave Le Bon, William McDougall, and Émile Durkheim (through his concept of Collective Consciousness).

ప్రతిపాదకులు: గస్టావ్ లీ బాన్ (Gustave Le Bon), విలియం మెక్‌డూగల్ (William McDougall), మరియు ఎమిలి డీర్ఖైమ్ (Collective Consciousness ద్వారా).

Core Concept: When individuals gather into a crowd or a highly integrated group, their individual personalities, rationality, and consciousness disappear. A new, collective psychic entity emerges, known as the “Group Mind” or “Crowd Mind.”

ముఖ్య భావన: విడివిడిగా ఉన్నప్పుడు వివేకంతో ప్రవర్తించే వ్యక్తులందరూ ఒక సమూహంగా (Crowd) మారినప్పుడు, వారి వ్యక్తిగత ఆలోచనా శక్తి, విచక్షణ నశిస్తాయి. ఆ సమూహానికి ఒక కొత్త ఉమ్మడి మనస్సు ఏర్పడుతుంది. దీన్నే ‘సమూహ మనస్సు’ లేదా ‘గుంపు మనస్తత్వం’ (Mob Mentality) అంటారు.

Key Characteristics:

1. The group mind is highly suggestible, emotional, and less rational than the individual minds composing it.

2. It creates a sense of anonymity, which reduces individual moral responsibility.

లక్షణాలు: గుంపులో ఉన్నప్పుడు మనిషి చాలా ఉద్వేగభరితంగా మారతాడు, సులభంగా రెచ్చిపోతాడు. తనేం చేస్తున్నాడో తెలియని ఒక అజ్ఞాత స్థితిలోకి (Anonymity) వెళ్ళిపోవడం వల్ల నైతిక బాధ్యత మర్చిపోతాడు.

Famous Book: The Crowd: A Study of the Popular Mind (1895) by Gustave Le Bon.

ప్రసిద్ధ గ్రంథం: ది క్రౌడ్: ఎ స్టడీ ఆఫ్ ది పాపులర్ మైండ్- రచియత: గస్టావ్ లీ బాన్.

Real-World Examples నిజ జీవిత ఉదాహరణలు:

Mob Mentality / Riot Behaviour: A law-abiding citizen, when part of a furious mob, might throw stones or damage public property because the “group mind” takes over his individual conscience.

ఉన్మాద గుంపు (Mob/Riot): సమాజంలో ఎంతో పద్ధతిగా ఉండే ఒక సామాన్యుడు, ఒక అల్లరి మూకలో భాగమైనప్పుడు… అందరితో కలిసి బస్సుల మీద రాళ్ళు రువ్వడం, ఆస్తులు ధ్వంసం చేయడం చేస్తాడు. అక్కడ అతని సొంత మనస్సు కాకుండా ఆ “గుంపు మనస్సు” అతనిని నడిపిస్తుంది.

Sports Stadiums: Thousands of fans chanting, jumping, and crying in perfect synchronization during a cricket match display a collective emotional wave.

క్రీడా మైదానాలు (Sports Stadium): ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియంలోని వేల మంది ప్రేక్షకులు ఒకేసారి ఎగరడం, అరవడం, ఒకే ఉద్వేగానికి లోనవ్వడం సమూహ మనస్సుకు ఉదాహరణ.

3. Organic Theory / Organismic Theory (జీవవయవ సిద్ధాంతం)

Proponents (ప్రతిపాదకులు): Plato, Aristotle, Herbert Spencer.

Core Concept: Society is like a biological organism (human body). Just as hands and legs cannot survive outside the body, an individual cannot survive outside society. Here, society is primary.

మూల భావన: సమాజం ఒక జీవ జీవి (మానవ శరీరం) లాంటిది. చేతులు, కాళ్లు శరీరం వెలుపల ఎలాగైతే జీవించలేవో, అలాగే ఒక వ్యక్తి సమాజం వెలుపల జీవించలేడు. ఇక్కడ సమాజమే ప్రధానమైనది.

Herbert Spencer’s Organic Theory (హెర్బర్ట్ స్పెన్సర్ జీవవయవ సిద్ధాంతం)

హెర్బర్ట్ స్పెన్సర్ తన Principles of Sociology (1876) అనే గ్రంథంలో సమాజానికి మరియు మానవ శరీరానికి (జీవికి) మధ్య అద్భుతమైన పోలికను తెస్తూ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

The Core Parallel (ముఖ్యమైన పోలిక)

Just as a biological organism is born, grows, reaches maturity, and eventually decays, a society also undergoes a similar process of birth, growth, evolution, and decay.

ఒక జీవి ఏ విధంగా జన్మించి, పెరిగి, పరిణామం చెంది, చివరకు మరణిస్తుందో… సమాజం కూడా అదే విధంగా పుట్టి, అభివృద్ధి చెంది, పరిణామ క్రమంలో మారుతూ ఉంటుంది.

Spencer’s Three Sub-Systems (సమాజంలోని మూడు వ్యవస్థలు)

Spencer explained how the various organs of an organism function to keep the body alive, and how three important systems also function to keep society running:

ఒక జీవి శరీరం బ్రతకడానికి వివిధ అవయవాలు ఎలా పనిచేస్తాయో, సమాజం రన్ అవ్వడానికి కూడా మూడు ముఖ్యమైన వ్యవస్థలు పనిచేస్తాయని స్పెన్సర్ వివరించారు:

1. Sustaining System (పోషక వ్యవస్థ / జీవనాధార వ్యవస్థ)

In Organism (జీవిలో): The digestive system (అల్సరేషన్/జీర్ణవ్యవస్థ) that absorbs food and sustains the body.

In Society (సమాజంలో): The Economic System (ఆర్థిక వ్యవస్థ) – Industry, Agriculture, and Labor that produce goods and food to sustain the population.

Key Idea: సమాజం ఆకలి తీరడానికి, మనుగడ సాగించడానికి ఉపయోగపడే పారిశ్రామిక, వ్యవసాయ రంగాలే ఈ పోషక వ్యవస్థ.

2. Distributive System (పంపిణీ వ్యవస్థ)

In Organism (జీవిలో): The circulatory system (రక్తప్రసరణ వ్యవస్థ) where blood vessels transport oxygen and nutrients to all organs.

In Society (సమాజంలో): The Transportation and Communication network (రవాణా మరియు సమాచార వ్యవస్థ) – Roads, Railways, Internet, and Commercial channels that distribute goods and services everywhere.

Key Idea: శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో, సమాజంలో వస్తువులు, సేవలు, సమాచారం రవాణా వ్యవస్థ ద్వారా అలానే పంపిణీ అవుతాయి.

3. Regulating System (నియంత్రణ వ్యవస్థ)

In Organism (జీవిలో): The Central Nervous System & Brain (కేంద్ర నాడీ వ్యవస్థ మరియు మెదడు) that controls and protects the body.

In Society (సమాజంలో): The Political & Government System (రాజకీయ మరియు ప్రభుత్వ వ్యవస్థ) – Military, Police, and Laws that maintain order and protect the society from external threats.

Key Idea: మెదడు శరీర అవయవాలను అదుపు చేసినట్లే, ప్రభుత్వం లేదా రాజు సమాజంలో శాంతిభద్రతలను నియంత్రిస్తారు.

MCQ’S

Q1. Who among the following made the statement “Man is a social animal”? / “మానవుడు ఒక సంఘజీవి” అనే ప్రసిద్ధ వాక్యాన్ని అన్నది ఎవరు?

A) Plato

B) Aristotle

C) Socrates

D) Auguste Comte

Show Answer

✅ Answer: B) Aristotle

Q2. Which theory states that society is an artificial creation born out of a mutual agreement among individuals? / సమాజం అనేది వ్యక్తుల మధ్య కుదిరిన పరస్పర ఒప్పందం వల్ల ఏర్పడిన ఒక కల్పిత వ్యవస్థ అని చెప్పే సిద్ధాంతం ఏది?

A) Organic Theory / జీవవయవ సిద్ధాంతం

B) Social Contract Theory / సామాజిక ఒప్పంద సిద్ధాంతం

C) Conflict Theory / సంఘర్షణ సిద్ధాంతం

D) Functionalist Theory / ప్రకార్యాత్మక సిద్ధాంతం

✅ Answer: B) Social Contract Theory / సామాజిక ఒప్పంద సిద్ధాంతం

Q3. Who is the primary sociologist associated with comparing society to a biological organism in modern sociology? / ఆధునిక సమాజశాస్త్రంలో సమాజాన్ని ఒక జీవవయవంతో (Organic Analogy) విస్తృతంగా పోల్చిన శాస్త్రవేత్త ఎవరు?

A) Karl Marx

B) Max Weber

C) Herbert Spencer

D) Emile Durkheim

✅ Answer: C) Herbert Spencer

Q4. What is the fundamental dividing factor between Human Society and Animal Society? / మానవ సమాజానికి, జంతు సమాజానికి మధ్య గల ప్రాథమిక వ్యత్యాసం దేని వల్ల ఏర్పడుతుంది?

A) Size / పరిమాణం

B) Territory / భౌగోళిక ప్రాంతం

C) Culture / సంస్కృతి

D) Population / జనాభా

✅ Answer: C) Culture / సంస్కృతి

Q5. Thomas Hobbes, John Locke, and Rousseau are called ______ theorists. / థామస్ హాబ్స్, జాన్ లాక్, మరియు రూసోలను ఏ సిద్ధాంతకర్తలు అని పిలుస్తారు?

A) Organismic / ఆర్గానిస్మిక్

B) Social Contract / సోషల్ కాంట్రాక్ట్

C) Evolutionary / పరిణామ

D) Idealist / ఆదర్శవాద 

✅ Answer: B) Social Contract / సోషల్ కాంట్రాక్ట్

Q6. Who famously stated that life in the state of nature was “solitary, poor, nasty, brutish, and short”? / మానవుని ప్రాథమిక జీవన స్థితి ఒంటరిగా, దౌర్భాగ్యంగా, అసహ్యంగా, మృగప్రాయంగా ఉండేదని పేర్కొన్నది ఎవరు?

A) John Locke

B) Thomas Hobbes

C) Rousseau

D) Herbert Spencer

✅ Answer: B) Thomas Hobbes( థామస్ హోబ్స్)

Q7. Who authored the classic book “The Crowd: A Study of the Popular Mind”? / “ది క్రౌడ్: ఎ స్టడీ ఆఫ్ ది పాపులర్ మైండ్” అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించింది ఎవరు?

A) William McDougall

B) Gustave Le Bon

C) Émile Durkheim

D) Karl Marx

✅ Answer: B) TGustave Le Bon ( గుస్తావ్ లే బాన్)

Q8. According to John Locke, which of the following is NOT a natural right? / జాన్ లాక్ ప్రకారం, క్రింది వాటిలో ఏది సహజ హక్కు కాదు?

A) Right to Life / జీవించే హక్కు

B) Right to Property / ఆస్తి హక్కు

C) Right to Religion / మత హక్కు

D) Right to Liberty / స్వేచ్ఛ హక్కు 

✅ Answer: C) Right to Religion / మత హక్కు

Explanation: Locke identified only three primary natural rights: Life, Liberty, and Property.

Q9. What is the major historical criticism against the Social Contract Theory? / సామాజిక ఒప్పంద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్న ప్రధాన చారిత్రక విమర్శ ఏమిటి?

A) It gives too much power to the state / ఇది రాజ్యానికి ఎక్కువ అధికారాన్ని ఇస్తుంది

B) It is historically a myth and fiction / ఇది చారిత్రకంగా ఒక కల్పిత కథ లేదా అపోహ మాత్రమే

C) It ignores economic classes / ఇది ఆర్థిక తరగతులను విస్మరిస్తుంది

D) It was written by French philosophers / దీనిని ఫ్రెంచ్ తత్వవేత్తలు రాశారు 

✅ Answer: B) It is historically a myth and fiction / ఇది చారిత్రకంగా ఒక కల్పిత కథ లేదా అపోహ మాత్రమే

Q10. Who divided social sub-systems into Sustaining, Distributive, and Regulating systems? / సమాజ ఉప-వ్యవస్థలను పోషక, పంపిణీ మరియు నియంత్రణ వ్యవస్థలుగా విభజించినది ఎవరు?

A) Emile Durkheim

B) Herbert Spencer

C) Auguste Comte

D) Talcott Parsons

✅ Answer: B) Herbert Spencer

Q11. Match the following based on Herbert Spencer’s Organic Theory: / హెర్బర్ట్ స్పెన్సర్ జీవవయవ సిద్ధాంతం ఆధారంగా క్రింది వాటిని జతపరచండి:

1. Sustaining System —- i. Government & Military

2. Distributive System —- ii. Economic & Industry

3. Regulating System —- iii. Transport & Roads

A) 1-i, 2-ii, 3-iii

B) 1-ii, 2-iii, 3-i

C) 1-iii, 2-i, 3-ii

D) 1-ii, 2-i, 3-iii

✅ Answer: B) 1-ii, 2-iii, 3-i

Leave a Comment