1.15 – Culture and Civilization(సంస్కృతి మరియు నాగరికత)

Culture and Civilization in Sociology

సంస్కృతి మరియు నాగరికత – నిర్వచనాలు, లక్షణాలు మరియు విధులు

In social science, culture and civilization are two vital wheels that determine the course of society. Simply put, culture defines who we are, while civilization represents what we use.

సామాజిక శాస్త్రంలో సంస్కృతి (Culture) మరియు నాగరికత (Civilization) అనేవి సమాజ గమనాన్ని నిర్ణయించే రెండు ముఖ్యమైన చక్రాలు. సరళంగా చెప్పాలంటే, మనం ఏమై ఉన్నామో తెలిపేది సంస్కృతి, మనం దేనిని ఉపయోగిస్తున్నామో తెలిపేది నాగరికత.

Introduction to Culture

Culture is the way of life of a society. It includes beliefs, values, customs, traditions, language, religion, art, knowledge, and behavior patterns shared by members of society.

Culture distinguishes one society from another and is passed from one generation to the next through socialization.

సంస్కృతి (Culture) అనేది ఒక సమాజం యొక్క జీవన విధానం. ఇందులో విశ్వాసాలు, విలువలు, ఆచారాలు, సంప్రదాయాలు, భాష, మతం, కళలు, జ్ఞానం మరియు ప్రవర్తనా విధానాలు ఉంటాయి.

సంస్కృతి ఒక సమాజాన్ని మరొక సమాజం నుండి వేరు చేస్తుంది మరియు సామాజీకరణ ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది.

Part 1: Definitions by Eminent Sociologists / ప్రముఖుల నిర్వచనాలు

These are the important quotations that are likely to be asked about in exams with the question, “Who gave this definition?”:

పరీక్షలలో “ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు?” అని అడిగే అవకాశం ఉన్న ముఖ్యమైన కొటేషన్లు ఇవే:

  • Edward Burnett Tylor (ఇ.బి. టైలర్): In his book “Primitive Culture” (1871), he gave the most classic definition: “Culture is that complex whole which includes knowledge, belief, art, morals, law, custom, and any other capabilities and habits acquired by man as a member of society.” (సమాజంలో సభ్యుడిగా మనిషి సంపాదించుకున్న జ్ఞానం, నమ్మకాలు, కళలు, నైతికత, చట్టాలు, ఆచారాల కలయికే సంస్కృతి).

  • Robert MacIver & Charles Page (మెకైవర్ మరియు పేజ్) – Most Important: They famously stated: “Culture is what we are, civilization is what we use.” (సంస్కృతి అనేది మనం ఏమై ఉన్నామో తెలుపుతుంది; నాగరికత అనేది మనం దేనిని కలిగి ఉన్నామో లేదా ఉపయోగిస్తున్నామో తెలుపుతుంది).

  • Malinowski (మలినోవ్‌స్కీ): He defined culture as an “instrumental apparatus” or the handiwork of man to achieve his ends and satisfy his biological and psychological needs. (సంస్కృతి అనేది మానవుడు తన అవసరాలను తీర్చుకోవడానికి సృష్టించుకున్న ఒక సాధనం).

  • Robert Bierstedt (రాబర్ట్ బియర్‌స్టెడ్ట్):  Culture is the complex whole that we think, do, and possess as members of society.(సమాజ సభ్యులుగా మనం ఆలోచించే, చేసే మరియు కలిగి ఉండే వాటి సమాహారమే సంస్కృతి.)
Part 2: Features & Characteristics of Culture / సంస్కృతి యొక్క లక్షణాలు

Culture has certain distinct social characteristics: సంస్కృతికి కొన్ని ప్రత్యేకమైన సామాజిక లక్షణాలు ఉన్నాయి:

  • Culture is Learned (సంస్కృతి నేర్చుకోబడేది): This is not biological. It is not innate; rather, it is learned by observing others as one grows up in society. This process is called socialization.

  • ఇది జీవసంబంధమైనది (Biological) కాదు. పుట్టుకతో రాదు, సమాజంలో పెరిగే కొద్దీ ఇతరులను చూసి నేర్చుకుంటారు. ఈ ప్రక్రియనే సామాజికీకరణ (Socialization) అంటారు.

  • Culture is Shared (సంస్కృతి ఉమ్మడి ప్రాతిపదిక గలది): This does not belong to any single individual. All members of society share it.

  • ఇది ఏ ఒక్క వ్యక్తికో సొంతమైనది కాదు. సమాజంలోని సభ్యులందరూ దీనిని పంచుకుంటారు.

  • Culture is Transmissive (సంస్కృతి ఒక తరం నుండి మరో తరానికి అందుతుంది): Culture flows from ancestors to future generations through language and customs.

  • భాష, ఆచారాల ద్వారా సంస్కృతి పూర్వీకుల నుండి తరువాతి తరాలకు ప్రవహిస్తుంది.

  • Culture is Dynamic & Adaptive (నిరంతరం మారేది): Culture does not remain static; it is dynamic and changes in accordance with the passage of time.

  • సంస్కృతి ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండదు. కాల మార్పులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది (Dynamic).

  • Culture is Gratifying (అవసరాలను తీర్చేది): Culture fulfills not only physical needs—such as hunger and the need for shelter—but also psychological needs.

  • మానవుడి ఆకలి, ఆశ్రయం వంటి శారీరక అవసరాలతో పాటు మానసిక అవసరాలను కూడా సంస్కృతి తీరుస్తుంది.

  • Culture is Integrated, Idealistic and Cumulative: All cultural elements are interconnected and it contains ideals and values. Culture grows continuously.
  • సంస్కృతి సమగ్రమైనది, ఆదర్శవంతమైనది మరియు సంచితమైనది: సంస్కృతిలోని అంశాలన్నీ పరస్పరం అనుసంధానించబడి ఉంటాయి మరియు ఇది ఆదర్శాలను, విలువలను కలిగి ఉంటుంది. సంస్కృతి నిరంతరం వృద్ధి చెందుతుంది.
Part 3: Material vs Non-Material Culture (భౌతిక వర్సెస్ అభౌతిక సంస్కృతి)

Social scientist William F. Ogburn classified culture into two types in his book *Social Change*. Questions based on this concept frequently appear in exams.

సామాజిక శాస్త్రవేత్త విలియం ఎఫ్‌. ఆగ్బర్న్ (William F. Ogburn) తన “Social Change” పుస్తకంలో సంస్కృతిని రెండు రకాలుగా విభజించారు. ఈ కాన్సెప్ట్ నుండి ఎగ్జామ్ లో తరచూ ప్రశ్నలు వస్తాయి:

  • Material Culture (భౌతిక సంస్కృతి): Visible and tangible man-made objects. For example: houses, machines, technology, and clothes. (This can also be referred to as ‘civilization’.)

  • కంటికి కనిపించే, తాకగలిగే మానవ నిర్మిత వస్తువులు. ఉదాహరణకు: ఇళ్లు, యంత్రాలు, టెక్నాలజీ, బట్టలు. (దీనినే మనం ‘నాగరికత’ అని కూడా అనవచ్చు).

  • Non-Material Culture (అభౌతిక సంస్కృతి):
    Internal elements that are not visible to the eye. For example: thoughts, values, beliefs, religion, and arts.

  • కంటికి కనిపించని అంతర్గత అంశాలు. ఉదాహరణకు: ఆలోచనలు, విలువలు, నమ్మకాలు, మతం, కళలు.

  • Cultural Lag (సాంస్కృతిక విలంబన): The gap that arises because material culture (technology) advances more rapidly than non-material culture is known as ‘cultural lag.’ This concept was proposed by Ogburn.

  • అభౌతిక సంస్కృతి కంటే భౌతిక సంస్కృతి (టెక్నాలజీ) వేగంగా ముందుకు దూసుకుపోవడం వల్ల ఈ రెండింటి మధ్య వచ్చే గ్యాప్ ని ‘Cultural Lag’ అంటారు. దీనిని ప్రతిపాదించింది ఆగ్బర్న్.

Part 4: Functions of Culture / సంస్కృతి యొక్క విధులు
  • Shapes Personality: It systematizes a person’s behavior and way of thinking, and shapes their personality.

  • ఒక వ్యక్తి ప్రవర్తనను, ఆలోచనా విధానాన్ని క్రమబద్ధం చేసి అతని వ్యక్తిత్వాన్ని (Personality) మలుస్తుంది.

  • Social Control (సామాజిక నియంత్రణ): It regulates human behavior in society by defining what is right and what is wrong (morals, laws). 

  • సమాజంలో ఏది తప్పు, ఏది రైట్ (Morals, Laws) అని చెప్పడం ద్వారా మానవ ప్రవర్తనను నియంత్రిస్తుంది.

  • Provides Solutions:  It provides a person with mental strength and social support during times of crisis (such as death or famine).

  • సంక్షోభ సమయాల్లో (ఉదాహరణకు మరణం, కరువు) మనిషికి మానసిక ధైర్యాన్ని, సాంఘిక మద్దతును ఇస్తుంది.

Civilization (నాగరికత)

Civilization refers to the advanced stage of human society characterized by scientific progress, technology, urbanization, and material development.

Civilization represents external and material achievements of society.

నాగరికత (Civilization) అనేది విజ్ఞానం, సాంకేతికత, పట్టణీకరణ మరియు భౌతిక అభివృద్ధి ద్వారా వ్యక్తమయ్యే సమాజ పురోగతిని సూచిస్తుంది.

నాగరికత సమాజం యొక్క బాహ్య మరియు భౌతిక అభివృద్ధిని సూచిస్తుంది.

Definitions of Civilization

MacIver : Civilization is the whole mechanism and organization developed by man to control the conditions of life.

జీవిత పరిస్థితులను నియంత్రించడానికి మానవుడు అభివృద్ధి చేసిన వ్యవస్థల సమాహారమే నాగరికత.

Ogburn: Civilization consists mainly of material culture.

నాగరికత ప్రధానంగా భౌతిక సంస్కృతితో సంబంధం కలిగి ఉంటుంది.

Characteristics of Civilization

  1. Material Progress (భౌతిక పురోగతి)
  2. Scientific Development(శాస్త్రీయ అభివృద్ధి)
  3. Technological Advancement (సాంకేతిక పురోగతి)
  4. Urbanization (పట్టణీకరణ)
  5. Economic Growth (ఆర్థిక అభివృద్ధి)
  6. Organized Administration (వ్యవస్థీకృత పరిపాలన)
Functions of Civilization (నాగరికత యొక్క విధులు):
  • Provides Means of Living: It provides essential amenities such as roads, transportation, and communication to make human life easier.

  • మానవ జీవనాన్ని మరింత సులభతరం చేయడానికి అవసరమైన రోడ్లు, రవాణా, కమ్యూనికేషన్ వంటి వసతులను కల్పిస్తుంది.

  • Progress and Control over Nature: Science and technology help harness the forces of nature and contribute to the material progress of society.

  • సైన్స్ మరియు టెక్నాలజీ ద్వారా ప్రకృతి శక్తులను అదుపు చేయడానికి, సమాజ భౌతిక పురోగతికి (Material Progress) తోడ్పడుతుంది.

  • Division of Labour: Modern civilization increases the division of labor (specialization) within society and enhances production capacity.

  • ఆధునిక నాగరికత సమాజంలో శ్రమ విభజనను (Specialization) పెంచి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.

Frequently Asked Books & Authors

AuthorBook
E.B. TylorPrimitive Culture (1871)
Bronislaw MalinowskiA Scientific Theory of Culture
MacIver & PageSociety: An Introductory Analysis
William F. OgburnSocial Change

MCQ’s – Culture and Civilization(సంస్కృతి మరియు నాగరికత)

Culture MCQ Test
Q1. The sociological concept of "Cultural Lag", which describes the strain generated when material culture advances faster than non-material culture, was formulated by which thinker?
భౌతిక సంస్కృతి (సాంకేతికత), అభౌతిక సంస్కృతి (విలువలు, ఆచారాలు) కంటే వేగంగా అభివృద్ధి చెందినప్పుడు ఉత్పన్నమయ్యే అసమతుల్యతను వివరించే 'సాంస్కృతిక విలంబన' (Cultural Lag) భావనను ప్రతిపాదించిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు?
A) Edward Tylor / ఎడ్వర్డ్ టైలర్
B) William F. Ogburn / విలియం ఎఫ్. ఓగ్‌బర్న్
C) Bronislaw Malinowski / బ్రోనిస్లా మాలినోవ్‌స్కీ
D) Clifford Geertz / క్లిఫోర్డ్ గీర్ట్జ్
Answer: B) William F. Ogburn / విలియం ఎఫ్. ఓగ్‌బర్న్
Q2. Which of the following terms describes the tendency of individuals to judge and evaluate other cultures strictly based on the standards, values, and customs of their own culture?
ఇతర సంస్కృతులను తక్కువ చేసి చూస్తూ, తమ స్వంత సంస్కృతి యొక్క ప్రమాణాలు, విలువలు మరియు ఆచారాల ఆధారంగా మాత్రమే వాటిని అంచనా వేసే ప్రవృత్తిని క్రింది వాటిలో ఏమని పిలుస్తారు?
A) Cultural Relativism / సాంస్కృతిక సాపేక్షతత్వం
B) Ethnocentrism / స్వసమూహ పక్షపాతం లేదా ఎత్నోసెంట్రిజం
C) Cultural Assimilation / సాంస్కృతిక సాదృశ్యీకరణ
D) Xenocentrism / పరసమూహ పక్షపాతం లేదా జెనోసెంట్రిజం
Answer: B) Ethnocentrism / స్వసమూహ పక్షపాతం లేదా ఎత్నోసెంట్రిజం
Q3. The dynamic sociological process where a minority group or an individual gradually adopts the cultural patterns, beliefs, and behaviors of the dominant host society, losing their original distinct identity, is called:
ఒక మైనారిటీ సమూహం లేదా వ్యక్తి తమ అసలు విశిష్ట గుర్తింపును క్రమంగా కోల్పోతూ, ఆధిపత్య సమాజం యొక్క సాంస్కృతిక నమూనాలు, నమ్మకాలు మరియు ప్రవర్తనలను పూర్తిగా స్వీకరించే సామాజిక ప్రక్రియను ఏమంటారు?
A) Acculturation / పరసంస్కృతీకరణ
B) Enculturation / స్వసంస్కృతీకరణ
C) Assimilation / సాదృశ్యీకరణ లేదా విలీనం
D) Integration / సమైక్యత
Answer: C) Assimilation / సాదృశ్యీకరణ లేదా విలీనం
Q4. Who provided the classic and most widely accepted anthropological definition of culture as "that complex whole which includes knowledge, belief, art, morals, law, custom, and any other capabilities and habits acquired by man as a member of society"?
సంస్కృతిని "జ్ఞానం, నమ్మకం, కళ, నైతికత, చట్టం, ఆచారం మరియు సమాజంలో సభ్యుడిగా మనిషి సంపాదించిన ఇతర సామర్థ్యాలు, అలవాట్లతో కూడిన ఒక సంక్లిష్టమైన సమష్టి రూపం" అని మానవశాస్త్ర కోణంలో అత్యంత ప్రాచుర్యం పొందిన నిర్వచనాన్ని ఇచ్చినది ఎవరు?
A) Robert Redfield / రాబర్ట్ రెడ్‌ఫీల్డ్
B) Edward Tylor / ఎడ్వర్డ్ టైలర్
C) Franz Boas / ఫ్రాంజ్ బోస్
D) Ruth Benedict / రూత్ బెనెడిక్ట్
Answer: B) Edward Tylor / ఎడ్వర్డ్ టైలర్
Note: Given in his 1871 book "Primitive Culture".
Q5. The preference for products, styles, ideas, or cultural practices of societies other than one's own, often viewing one's own culture as inferior, is sociologically known as:
తమ స్వంత సంస్కృతి కంటే ఇతర సమాజాల ఉత్పత్తులు, శైలులు, ఆలోచనలు లేదా సాంస్కృతిక పద్ధతుల పట్ల మొగ్గు చూపుతూ, తమ సంస్కృతి తక్కువదనే భావన కలిగి ఉండటాన్ని సామాజిక శాస్త్రంలో ఏమంటారు?
A) Ethnocentrism / ఎత్నోసెంట్రిజం
B) Xenocentrism / జెనోసెంట్రిజం
C) Cultural Pluralism / సాంస్కృతిక బహుళత్వం
D) Counterculture / ప్రతిసంస్కృతి
Answer: B) Xenocentrism / జెనోసెంట్రిజం
Q6. Statement I: Non-material culture includes all tangible, physical objects created and used by human beings, such as tools, buildings, and technology.
Statement II: The practice of evaluating and understanding a culture within the context of its own values and standards, rather than judging it by the parameters of another culture, is known as Cultural Relativism.
ప్రకటన I: అభౌతిక సంస్కృతిలో మానవులు సృష్టించిన మరియు ఉపయోగించే పనిముట్లు, భవనాలు మరియు సాంకేతికత వంటి కంటికి కనిపించే భౌతిక వస్తువులన్నీ కలిసి ఉంటాయి.
ప్రకటన II: ఒక సంస్కృతిని మరొక సంస్కృతి యొక్క పారామితుల ఆధారంగా నిర్ధారించకుండా, దాని స్వంత విలువలు మరియు ప్రమాణాల పరిధిలోనే అర్థం చేసుకోవడాన్ని 'సాంస్కృతిక సాపేక్షతత్వం' (Cultural Relativism) అంటారు.
A) Both Statements are correct
B) Statement I is correct, Statement II is incorrect
C) Statement I is incorrect, Statement II is correct
D) Both Statements are incorrect
Answer: C) Statement I is incorrect, Statement II is correct
Note: Statement I describes material culture, not non-material culture.

Leave a Comment